ముంబైలో నైజీరియన్ ఘాతుకం.. 8 మందిని పొడిచేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ముంబైలో నైజీరియన్ ఘాతుకం.. 8 మందిని పొడిచేశాడు..

June 2, 2022

చదువు కోసం, ఆశ్రయం కోసం భారత్కు చేరుకుంటున్న ఆఫ్రికా వాసుల్లో కొందరు మాటల్లో చెప్పలేని నేరాలకు పాల్పడుతున్నారు. స్మగ్లింగ్, ఆర్థిక నేరాలే కాదు రక్తపాతం కూడా మొదలు పెట్టేశారు. ముంబైలో ఓ నైజీరియా జాతీయుడొకడు కత్తితో పాదచారులను ఇష్టమొచ్చినట్లు పొడిచేశాడు. దాడిలో 8 మంది గాయపడ్డారు.దక్షిణ ముంబైలోని పార్సీ వెల్ సమీపంలోని టాటా గార్డెన్‌లో రోడ్డుపై తిరిగే 50 ఏళ్ల జాన్ అనే ఆఫ్రికన్ ఈ దాడికి తెగబడ్డాడు. ఉన్నట్టు కత్తి తీసి రక్తపాతం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటే అక్కడికి చేరుకుని జాన్ నుంచి కత్తి లాక్కున్నారు. క్షతగాత్రును చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుణ్ని మైదాన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.