రాత్రి ట్రైన్‌‌లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త... అలా చేస్తే అంతే సంగతి.. - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రి ట్రైన్‌‌లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త… అలా చేస్తే అంతే సంగతి..

November 1, 2022

 

 

మీరు రైళ్లలో ప్రయాణించినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారా ? లేట్ నైట్స్ లైట్స్ వేసి ఫెండ్స్ తో ముచ్చట్లు పెడుతున్నారా? అలా ఐతే ఈ న్యూస్ మీకోసమే.. ఇకపై అలాంటివి రైళ్లలో సాగవు.. ఒకవేళ కాదు కూడదు అంటే భారీ జరిమానాతో మీ జేబు చిల్లు పడడం ఖాయం.. రైల్వే శాఖ కఠినమైన రూల్స్ తో ముందుకొచ్చింది. ప్రయాణికుల హ్యాపీ జర్నీ కోసం పక్కాగా నిబంధనలను అమలు చేయునుంది. రాత్రి పూట ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది..

తప్పక పాటించాల్సిన రైల్వే శాఖ నిబంధనలు :

*రాత్రి 10 గంటల తర్వాత రైళ్లలో ప్రయాణికులెవరూ గట్టిగా మాట్లాడకూడదు
*రాత్రి 10 గంటల దాటిన వెంటనే లైట్స్ ఆపివేయాలి
*పెద్ద పెద్ద సౌండ్స్ తో పాటలు వినకూడదు
*మిడిల్ బెర్త్ వచ్చిన ప్రయాణీకులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవచ్చు
*రాత్రి 10 గంటల తర్వాత టీటీలు టికెట్ల తనిఖీ చేయరాదు.
*ఎవరైనా ప్రయాణికుడు రాకపోతే అతని టికెట్ రెండు స్టేషన్స్, గంట తర్వాత వేరేవారికి ఈ సీటు కేటాయించాలి.
* ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రైలులో ప్రయాణించేటప్పుడు.. ఒకరికి సీట్ కన్ఫర్మ్ అయ్యి.. మరొకరికి అవ్వకపోతే.. ఒకవేళ అందులో కన్ఫర్మ్ అయిన వ్యక్తి ప్రయాణించని ఎడల.. దాన్ని సీట్ కన్ఫర్మ్ కాని వ్యక్తికి కేటాయించాలి.

ఇప్పటికే ఈ నిబంధనలు అమలులో ఉండగా.. వీటిని ప్రయాణీకులు కచ్చితంగా పాటించాలని రైల్వేశాఖ తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే పలువురు ప్రయాణీకుల నుంచి రాత్రివేళల్లో కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారని, లైట్లు వేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు అందటంతో.. రూల్స్ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది రైల్వే శాఖ. ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.