ఈ మధ్య వెలుగులోకి వచ్చిన పబ్ వ్యవహారంలో వార్తల్లో నానిన మెగా డాటర్ నిహారిక మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన భర్త చైతన్యతో లిప్ లాక్ చేసిన రొమాంటిక్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. గత కొంతకాలంగా భర్తతో విభేదాలు అంటూ రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.
వాటిని చెక్ పెట్టేందుకే ఇలాంటి ఫోటో రిలీజ్ చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు ఇంత బోల్డ్తనం అవసరమా? అని ట్రోల్ చేస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫోటో లేటెస్ట్‌ది కాదు. ఈ ఫోటోను నిహారిక షేర్ చేయలేదు. ఎవరో ఆమె పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఈ పిక్‌ను పోస్ట్ చేశారు. ఏదేమైనా రొమాంటిక్ ఫోటో మాత్రం వైరల్‌గా మారింది.