వివాదాస్పదంగా నిహారిక ఫారిన్ టూర్ ఫోటోలు..!
అక్కినేని వారి మాజీ కోడలు సమంత విడాకుల తరువాత.. మెగా ఫ్యామిలీ టార్గెట్ గా కథనాలు రావటం స్టార్ట్ అయ్యాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండవ వివహంపై నీలిమబ్బులు కమ్ముకున్నాయని వదంతులు వచ్చాయి. హీరో కళ్యాణ్ దేవ్ తో వివాహం అనంతరం కొన్నాళ్ళు సజావుగా జరిగిన కాపురంలో ఒడిదుడుకులు వచ్చాయని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ వదంతులకు ఊతమిస్తూనే కళ్యాణ్ దేవ్ ఎక్కడ మెగా ఫామిలీ ఈవెంట్స్ లో కనిపించకపోవడం.. కళ్యాణ్ దేవ్ సినిమాలకు మెగా హీరోలు గైర్హాజరవుతుండటం జరుగుతూ వస్తుంది. శ్రీజ, కళ్యాణ్ దేవ్ రూమర్స్ కి తోడు నిహారికపై కూడా గాసిప్స్ గుప్పుమంటున్నాయి. వ్యాఖ్యాతగా మొదట కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక.. ఆ తరువాత హీరోయిన్ గాను కొన్ని సినిమాలు చేసింది. ఆ తరువాత సాఫ్ట్ వేర్ అయిన చైతన్య జొన్నలగడ్డతో అట్టహాసంగా వివాహం జరిగింది. పెళ్లి తరువాత నిర్మాతగా వెబ్ సిరీస్ లు తీస్తూ దూసుకెళ్తున్న నిహారిక వ్యక్తిగత జీవితం సాఫీగా లేదని సోషల్ మీడియాలో ఎప్పటి నుండో రూమర్స్ ఉన్నాయి.
నిహారిక, చైతన్యల మధ్య గ్యాప్ వచ్చిందని.. ఇద్దరు వేరువేరు ఇళ్లల్లో ఉంటున్నారని కథనాలు వచ్చాయి. వీటికి ఊతమిస్తూ.. నిహారిక ప్రస్తుత విహారయాత్రల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిహారిక తన ఫ్రెండ్స్ తో విదేశాలకు ట్రిప్ వెళ్లి జాలీగా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో.. అక్కడ తన భర్త లేకపోవడం చూసి ప్రతి ఒక్కరు కూడా ఇదే నిజం అంటూ నమ్ముతున్నారు. నిహారిక తన స్నేహితులతో కలిసి టర్కీ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన స్నేహితులతో ట్రిప్ ఎంజాయ్ చేయడం బాగున్నప్పటికీ వివాహం అనంతరం అందులోను కొత్తగా వివాహం జరిగింది. తన భర్త కూడా లేకుండా తాను ఒక్కతే వెళ్లడంతో నిహారికపై రకరకాల కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిహారిక ఫోటోలను చూసిన తర్వాత చైతన్య లేడే? ఆయనెక్కడ ? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు..మరి ఈ కామెంట్లకు ఆమె ఎలా స్పందిస్తుందో తెలియాల్సి వుంది.