ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్

May 18, 2022

టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిజామాబాద్ యువ బాక్సర్ నిఖత్ జరీనా ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో నిఖత్.. బ్రెజిల్‌కు చెందిన కరోలైన్ డి అల్మేడాను 5-0 పాయింట్ల తేడాతో ఓడించింది. ప్రత్యర్థిపై అన్ని బౌట్లలోనూ ఆధిపత్యం చెలాయించి, అద్భుతమైన విజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. 2022లో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా జరీన్ నిలిచింది. ఇప్పటి వరకు భారత్‌లో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా సీ మాత్రమే ప్రపంచ టైటిల్స్ సాధించిన మహిళా బాక్సర్లు కావడం గమనార్హం.

ఇప్పుడు ఈ అవకాశం నిఖత్ జరీన్ చేతుల్లో ఉంది. ఫైనల్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తే కచ్చితంగా స్వర్ణం ఆమె సొంతమవుతుంది. రేపు గురువారం ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌తో నిఖత్ పోటీ పడనుంది.