Nikhat Zareen Strikes Gold At Women's World Boxing Championships, Beats Vietnam's Nguyen Thi Tam In Final
mictv telugu

నిఖత్ జరీన్ గోల్డెన్ పంచ్.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో స్వర్ణం

March 26, 2023

Nikhat Zareen Strikes Gold At Women's World Boxing Championships, Beats Vietnam's Nguyen Thi Tam In Final

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‎కు మరో బంగారు పతకం దక్కింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ 50 కేజీల విభాగంలో దేశానికి స్వర్ణం తెచ్చిపెట్టింది. ఫైనల్ మ్యాచ్ లో వియత్నాంకు చెందిన గుయెన్‌ థి టామ్‌ను నిఖత్ 5-0తో చిత్తు చేసింది. 2022లో ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న నిఖత్ జరీన్..రెండోసారి కైవసం చేసుకుని రికార్డు పుస్తకాలను తిరగరాసింది. ఈ విజయంతో, నిఖత్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లెజెండరీ మేరీ కోమ్ తర్వాత ఎక్కువ బంగారు పతకాలను గెలుచుకున్న రెండవ భారతీయురాలుగా నిలిచింది. మేరీ కోమ్ తన అద్భుతమైన కెరీర్‌లో ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ (2002, 2005, 2006, 2008, 2010 మరియు 2018) స్వర్ణాలను గెలుచుకుంది నిఖత్ 2022 మరియు 2023 ఎడిషన్లలో గోల్డ్ మెడల్స్ సాధించింది.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 3 బంగారు పతకాలు దక్కాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల విభాగంలో సావిటీ బూరా స్వర్ణం దక్కించుకున్నారు. ఇప్పుడు జరీన్‌కు గోల్డ్ పంచ్ విసిరింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం దక్కే అవకాశం ఇంకా మిగిలే ఉంది. ఒలింపిక్స్ విజేత లవ్లీనా బోర్గహైన్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

వరుసగా రెండో సారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలిపారు. “మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జెండా మరోసారి రెపరెపలాడింది..స్వర్ణం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన నిఖత్ జరీన్‎కు అభినందనలు” అంటూ కవిత్ ట్వీట్ చేశారు.