తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన సత్తా చాటింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో నిఖత్ జరీన్ విజయం సాధించి విజేతగా నిలిచింది. దీంతో, ఈఏడాది ఆడిన అన్ని టోర్నమెంట్లలోనూ గెలిచిన నిఖత్ అజేయంగా నిలిచినట్టయింది.
అంతకుముందు ఆదివారం 50 కేజీల విభాగం సెమీస్‌లో ఆలిండియా పోలీస్ (ఏజీపీ) జట్టు బాక్సర్ శివిందర్ కౌర్‌పై నిఖత్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి. మ్యాచ్ ఆరంభం నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న నిఖత్.. ఈ బౌట్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. అదే ఫామ్‌తో ఈనాటి ఫైనల్లో రైల్వేస్ బాక్సర్ అనామికతో 4-1 తేడాతో గెలిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సొంతం చేసుకున్న నిఖత్ ఇప్పుడు జాతీయ చాంపియన్ షిప్ కూడా గెలిచి ఔరా అనిపించింది.
ఇవి కూడా చదవండి
బీహార్‌లో ఐదుగురు విదేశీయులకు కరోనా
ఈ విద్యార్థి కోసం నెలకు రూ.3లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం