NIKHIL COMING WITH TWO MORE PAN INDIA MOVIES
mictv telugu

పాన్ ఇండియా మూవీలతో దూసుకొస్తున్న నిఖిల్

March 17, 2023

NIKHIL COMING WITH TWO MORE PAN INDIA MOVIES

కార్తికేయ2 సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో నార్ లో మంచి పేరు సంపాదించేశాడు. ఒక చిన్న సినిమా…ఏ సపోర్ట్ లేకుండా ఏకంగా 25 కోట్ల కలెక్ట్ చేసింది. ఇప్పడు ఈ నేపధ్యంలో నిఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్, పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు. స్పై అనే టైటిల్ తో మూవీ షూటింగ్ ను కూడా నిఖిల్ పూర్తి చేశాడు.

పాన్ ఇండియా రేంజ్ లో స్పై మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఇందులో నిఖిల్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా, ఠాగూర్ మధు నిర్మాణంలో చేయడానికి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుట. ఈ మూవీని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తీయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా మూవీ అంటే పీరియాడిక్ జోనర్ కథలతోనే ఎక్కువ వస్తున్నాయి. ఆ జోనర్ ని టచ్ చేస్తేనే యూనివర్శల్ అప్పీల్ ఉంటుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులు కూడా ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా కథలు సిద్ధం చేసి హీరోలని ఒప్పిస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ తో ఠాగూర్ మధు నిర్మించే ఈ కొత్త చిత్రం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథాంశంగానే ఉండబోతుంది అని తెలుస్తుంది. పునర్జన్మల నేపధ్యంలో ఈ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కార్తికేయ2 కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని పాన్ ఇండియా రేంజ్ లో అందుకొని టాప్ స్టార్స్ పక్కకి వెళ్లాలని చూస్తున్న నిఖిల్ కి ఈ మూవీ ఆ కోరిక తీరుస్తుందని భావిస్తున్నాడు.