'ఆర్ఆర్ఆర్'పై నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..అవసరమా?
తెలుగు చిత్రసీమ పరిశ్రమలో ఇప్పటికి, ఎప్పటికి చేరిగిపోని కొన్ని అద్బుతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఆయన 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో దేశంలోని సినీ ప్రియులకు డైరెక్టర్‌గా పరిచయమై, పలు అద్బుతమైన సినిమాలను తెరకెక్కించారు. అంతేకాదు, తెలుగు భాష అంటే తెలియని ప్రపంచదేశాలకు తన సినిమాల ద్వారా తేలిసేలా చేసి, ఆయా దేశాల్లో రికార్డులను సృష్టించారు. ఇటీవలే ఇద్దరు స్టార్‌లతో 'ఆర్ఆర్ఆర్' అనే చిత్రాన్ని తెరకెక్కించి, రికార్డులు బద్దలుకొట్టారు. ఇటువంటి ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో హీరోలుగా జూ. ఎన్టీఆర్, రాంచరణ్‌లు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై, భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైనా అన్నీ భాషల్లో రికార్డులను సృష్టించింది. కానీ, ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. అయితే, సినీ ప్రేక్షకులు మాత్రం ఆస్కార్ బరిలో 'ఆర్ఆర్ఆర్' ఖచ్చితంగా నిలుస్తుందని కలలుకన్నారు. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు సైతం స్పందిస్తూ…'ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని భావించాం. కానీ, చివరకు నిరాశ మిగిలింది' అని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అయితే, హీరో నిఖిల్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. తాజాగా ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ.."ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ అవసరమా? నాకు ఆస్కార్ అవార్డులపై పెద్ద ఆసక్తి కానీ, మంచి అభిప్రాయం కానీ లేదు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే ఆస్కార్. దాని కంటే ఆస్కార్ ఎక్కువేమి కాదు. మనకు ఫిల్మ్‌ఫేర్, జాతీయ అవార్డులు ఉన్నాయి. అలాంటప్పుడు ఆస్కార్ అవార్డులు మనకెందుకు. భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆడుతున్నాయి. అదే గొప్ప విషయం. నేను ఇటీవల స్పెయిన్‌కు వెళ్లినప్పుడు అక్కడ 'ఆర్ఆర్ఆర్' చూశాను. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లన్నీ ఫుల్‌గా ఉన్నాయి. స్పెయిన్‌లోనే కాదు. సినిమా విడుదలైన అన్ని దేశాల్లో బ్రహ్మాండంగా ఆడుతోంది. ఇంతకు మించి మనకు ఏం కావాలి చెప్పండి. ఇటువంటి సమయంలో ఆస్కార్ మనకు అవసరమా?" అని ఆయన చెప్పుకొచ్చారు.