పవన్ కల్యాణ్ గడ్డం ఇష్టం..మెగాస్టార్ ఎవరో తెలియదు : సినీ నటి - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ గడ్డం ఇష్టం..మెగాస్టార్ ఎవరో తెలియదు : సినీ నటి

April 18, 2022

04

మెగాస్టార్ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదంలో చిక్కుకుంది సినీనటి నికిషా పటేల్. పవన్ కల్యాణ్ సరసన కొమురం పులి సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. తనను పెళ్లిచేసుకునే వాడు యూకేలో ఉన్నాడని, త్వరలో మా పెళ్లి జరుగుతుంది అని వెల్లడించింది. అలాగే దక్షిణాది సినిమా హీరోలపై తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకొంది. మహేశ్ బాబు ఫెయిర్ అండ్ లవ్లీ, ప్రభాస్ మంచి స్నేహితుడు, రజనీకాంత్ కింగ్, ఫేవరెట్ హీరో ధనుష్, పవన్ కల్యాణ్ గడ్డం అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. మెగాస్టార్ గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆయన ఎవరో నాకు తెలియదని సమాధానమిచ్చింది. పవన్ కల్యాణ్‌తో పనిచేసిన దానివి, మెగాస్టార్ ఎవరో తెలియదా? అందుకే నీకు సినిమా అవకాశాలు రావట్లేదు అంటూ అభిమానులు నిలదీశారు. దాంతో సినిమా స్టార్లలో సల్మాన్ ఖాన్, మలయాళ మమ్ముట్టిలను కూడా మెగాస్టార్ అంటారంటూ తప్పించుకుంది. దాంతో నెటిజన్లు ఆమెను పలు రకాలుగా కామెంట్లు పెడ్తూ విమర్శిస్తున్నారు.