అతడు రీసెర్చ్ స్కాలర్.. స్వలింగ సంపర్కుడితో స్నేహం ఏర్పడింది. దానికి తోడు మూఢభక్తి కూడా తోడైంది. కలలు, పునర్జన్మ వంటి నానా ఆలోచనలతో సతమతమై చెరువులో దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. తన గే సహచరుడి ప్రాణాలు కాపాడేందుకే తాను చనిపోతున్నట్లు ఫేస్ బుక్‌లో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.హరిద్వార్‌కు చెందిన నీలోత్పల్ (27) భోపాల్‌లో నానో టెక్నాలజీలో రీసెర్చ్ చేస్తున్నాడు. తల్లి డాక్టర్, తండ్రి ప్రభుత్వ ఉన్నతోద్యోగి. నీలోత్పల్‌కు కాళీ మాత అంటే చాలా భక్తి, భయం. నల్లగుడ్డలే ధరించేవాడు. అతనికి గతంలో కలలో కాళీమాత కనిపించింది.. ‘నీకు ఈ జన్మలో ఒక గే తోడవుతాడు. అయితే అతడు ప్రపోజ్ చేసిన రోజున నువ్వూ, అతడూ చనిపోతారు..’ అని చెప్పిందట. పరిష్కారం కోరగా.. వచ్చే జన్మలో మీకు పెళ్లవుతుందని చెప్పిందట. ‘కాళీ మాత చెప్పినట్లే అతడు నా జీవితంలోకి వచ్చాడు. మేం శారీరకంగా కలవలేదు. కానీ ప్రేమగా ఉన్నాం.. నేను చనిపోతున్నా.. నా చితికి నా గే ఫ్రెండే నిప్పు పెట్టాలి’ అని నీలోత్పల్ ఆత్మహత్యకు ముందు రోజు తీసుకున్న సెల్ఫీ వీడియోలో చెప్పాడు. వీడియో చూసిన తల్లిదండ్రులు భయంతో అతనికి ఫోన్ చేశారు. అయితే స్విచాఫ్ వచ్చిది.
నీలోత్పల్ గతంలో గువహటిలోని కామాఖ్య దేవి గుడికి వెళ్లి, తనకు, తన గే ఫ్రెండ్ తో పెళ్లయ్యేలా చూడాలని కోరాడు. తర్వాత ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి చికత్స చేయించారు. కానీ మళ్లీ కలలు, కలవరింపులు ఎక్కువై ప్రాణం తీసుకున్నాడు.