నీలోఫర్ చాయ్ బాస్ బాబూరావు అంతరంగం.. స్పెషల్ ఇంటర్వ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

నీలోఫర్ చాయ్ బాస్ బాబూరావు అంతరంగం.. స్పెషల్ ఇంటర్వ్యూ

March 31, 2022

హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఇరాన్ చాయ్.. అంతేకాదు ఇప్పుడు నీలోఫర్ చాయ్ కూడా! రంగు, రుచి, నాణ్యత అని అప్పట్లో ఓ టీ యాడ్ వచ్చేంది. ఆ సంగతేమోగాని నీలోఫర్ టీ మాత్రం ఆ మూడింటి కలయిక అనడంలో సందేహం లేందంటుంటారు కస్టమర్లు. 10 పైసల చాయ్ అమ్మిన రోజులకు నుంచి రూ. 1000కి చాయ్ అమ్మే దశకు చేరుకున్న నీలోఫర్ కెఫే విజయం ఏమిటి? కస్టమర్లు ఎందుకంతగా ఆ చాయ్ ని ఆస్వాదిస్తున్నారు. ఆ కెఫేలకు వెళ్లడమే కాకుండా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పంచుకుంటున్నారు? అసలు నీలోఫర్ బాస్ బాబూరావు సక్సెస్ మంత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మైక్ టీవీ ఆయనతో చేసిన స్పెషల్ ఇంటర్యూ..

నాలుగు దశాబ్దాల కిందట చేతిలో ఒక్కపైసా లేకుండా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాబూరావు ఈ రోజు కోట్ల వ్యాపారానికి అధిపతి కావడం, వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ల పిల్లలను చదివించడం.. మొదలైన వివరాలన్నీ పంచుకున్నారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు ఆసక్తికరం. మరెందుకు ఆలస్యం, వెంటనే చూడండి..