కావడితో నీళ్లు మోసి టీడీపీ ఎమ్మెల్యే నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

కావడితో నీళ్లు మోసి టీడీపీ ఎమ్మెల్యే నిరసన

November 23, 2019

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపే పద్దతే వేరుగా ఉంటుంది. సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా సమస్యలపై ఒకే రకంగా పోరాటం చేస్తూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నసమయంలో స్మశానవాటిక అభివృద్ధి జరగడంలేదని అధికారుల తీరుకు నిరసనగా స్మశానంలో పడుకొని నిరసన తెలిపారు. ఇటీవల మున్సిపల్ అధికారి తీరుకు నిరసనగా ఆఫీసు ముందే చలిలో పడుకున్నారు. తాజాగా మరోసారి నిరసన బాటపట్టారు. రోడ్ల పక్కన పెంచిన చెట్లను పట్టించుకునే వారే లేరని ఆయనే స్వయంగా వాటికి నీరు తెచ్చి పోస్తూ నిరసన తెలిపారు. 

TDP MLA

ప్రభుత్వం మొక్కలు పెంచాలని కోరుతుంటే.. అధికారులు మాత్రం వాటిని నాటి పట్టించుకోకుండా వదిలేశారు. చాలా  రోజులుగా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి లారీ స్టాండ్‌ వరకు పూల మొక్కలను నాటి వాటికి నీరు పోయడం మాత్రం మర్చిపోయారు. అవి ఎండిపోయే స్థితికి వచ్చినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూఆయనే స్వయంగా  కావడి బిందెలతో నీళ్లు తెచ్చి వాటికి పోశారు. మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రోజా రమణి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు చాలా అలసత్వంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొక్కలకే నీరు పోయలేని వారు ప్రజల కోసం ఏం పనిచేస్తారని అధికారుల తీరును తప్పుబట్టారు. 

Nimmala Ramanaidu.