రోజుకు 4వేల కరోనా పరీక్షలు.. నిమ్స్‌లో మిషన్ సిద్ధం - MicTv.in - Telugu News
mictv telugu

రోజుకు 4వేల కరోనా పరీక్షలు.. నిమ్స్‌లో మిషన్ సిద్ధం

September 25, 2020

Nims Cobas Machine Test

తెలంగాణలో కరోనా పరీక్షలు వేగంగా జరగడం లేదని గతంలో విపక్షాలు ఆరోపించాయి. వాటిని తిప్పికొడుతూ ప్రభుత్వం ప్రతి రోజు రికార్డు స్థాయిలో శాంపిళ్లను టెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు మరో ముందుడుగు వేశారు. రిపోర్టు కోసం ఇంకా గంటల తరబడి వేచిచూసే అవసరం లేకుండా తక్కువ సమయంలోనే ఎక్కు వ టెస్టులు చేసేందుకు సిద్ధం అయ్యారు.  కోబాస్ 8800 యంత్రం సేవలను అందుబాటులోకి తెచ్చారు. నిమ్స్ ఆస్పత్రిలో దీన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. 

ఈ యంత్రం ద్వారా ప్రతి రోజూ 4 వేల ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేసే వీలు ఉంది.  దీని ద్వారా వేగంగా రోగులను గుర్తించి వారిని ఐసోలేషన్ చేసే అవకాశం ఉందని ఈటల అన్నారు. రూ. 7 కోట్లు ఖర్చు చేశారు.  వైద్య రంగంలో అనేక అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. కాగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాపిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచామన్నారు. రోజుకు 20 వేల శాంపిళ్లను పరీక్షిస్తున్నట్టు ఈటల చెప్పారు.