నిమ్స్‌లో హాహాకారాలు.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా  - MicTv.in - Telugu News
mictv telugu

నిమ్స్‌లో హాహాకారాలు.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా 

July 9, 2020

Nims contract employees protest

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఆస్పత్రి నిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది మెరుపుసమ్మెకు దిగారు. ఈ రోజు ఉదయం నుంచి విధులను బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. తమకు జీతాలు చెల్లించడం లేదని, కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వందలాది రోగులు వైద్యం అందక పడిగాపులు పడుతున్నారు. 

సిబ్బంది నిరసనతో ధారణ ఒపీ సేవలతో పాటు, అత్యవసర సేవలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. ఓపీ టైం ముగిసినా నిరసనలు సాగుతున్నాయి. 2003 నాటి జీవో ప్రకారం తమను పర్మినెంట్ ఉద్యోగులుగా తీసుకోవాలని, రవాణా అలవెన్సులు ఇవ్వాలని కోరుతున్నారు. నిరసన ఫలితంగా కేన్సర్,  డయాలసిస్ పేషంట్లతోపాటు షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. నిమ్స్‌లో వందలాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వైద్యసేవలతోపాటు ఓపీ స్లిప్పలు ఇవ్వడం, స్క్రీనింగ్,  బిల్లింగ్ కౌంటర్స్ వంటి వీరు పనిచేస్తున్నారు. వారి డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో పేషంట్లు కౌంటర్ల వద్ద యాతన పడుతున్నారు.