Nims director Manohar joined Apollo after suffering a heart attack
mictv telugu

నిమ్స్ పరువు తీసిన డైరెక్టర్.. గుండెపోటుకు అపోలోలో చికిత్స

September 7, 2022

ప్రభుత్వ ఆసుపత్రులపై సాధారణ, మధ్య తరగతి ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. నాణ్యమైన వైద్యం ఉండదని, డబ్బులు ఖర్చయినా ప్రైవేటు ఆసుపత్రికే వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అలాంటిది నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్‌గా ఉండి గుండెపోటు వచ్చిందని అపోలోలో చేరారు సీనియర్ డాక్టర్ మనోహర్. గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన రెండ్రోజుల క్రితం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ పరిణామం నిమ్స్ సిబ్బందిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు భావించే నిమ్స్ డైరెక్టరే ఇలా చేయడంతో తమను చిన్నచూపు చూస్తారని మండిపడుతున్నారు. రోబోటిక్ సర్జరీ వంటి ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్న నిమ్స్‌పై డైరెక్టర్‌కే విశ్వాసం లేకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటివి కూడా ఆధునిక పద్దతుల్లో విజయవంతంగా చేసే వైద్య నిపుణులున్న నిమ్స్‌లో కాకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం తమకు తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.