రామరామ ఉయ్యాలో.. నేడు అట్ల బతుకమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

రామరామ ఉయ్యాలో.. నేడు అట్ల బతుకమ్మ

October 20, 2020

Bathukamma Festival

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఊరూవాడా బతుకమ్మ పండగ వాతావరణం అలుముకుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా అమ్మలక్కలు బతుకమ్మ పండగ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు కానీ, ఈసారి కరోనా వైరస్, అతి వర్షాలు పండగ కళను తప్పించాయి. అరకొరగానే బతుకమ్మలు ఆడుతున్నారు. ఈ విపత్తులు అనేవి లేకుండా ఉండుంటే బతుకమ్మ వైభవం నలుదిక్కుల వ్యాపించేది. 9 రోజులు ఉత్సవంలో భాగంగా  ఇప్పటికే నాలుగురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నిన్న నానేబియ్యం బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. నేడు ఐదో రోజు ఉత్సవం కావున టుకుల బతుకమ్మగా కొలుస్తారు. 

అట్లను బతుకమ్మకు ప్రసాదంగా సమర్పిస్తారు. బియ్యం, మినప పప్పు ఒకరోజు ముందుగానే నానబెట్టి దంచి రుచికరమైన అట్లు వేస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు, చామంతి, మందార, బీర, గుమ్మడి తదితర పూలతో ఐదు ఎత్తుల్లో బొడ్డెమ్మలను పేరుస్తారు.  ఆడపడచులంతా సాయంత్రం బతుకమ్మ ఆడి, పాడి నీటిలో నిమజ్జనం చేసిన తరువాత అట్లను ప్రసాదంగా ఆరగిస్తారు.