ఏపీ పోలీసులపై మద్యం మాఫియా దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ పోలీసులపై మద్యం మాఫియా దాడి 

October 19, 2020

Nine held for selling liquor procured from Yanam.jp

ఏపీలో అక్రమ మద్యం రవాణా ఏమాత్రం ఆగడంలేదు. పోలీసుల కన్నుగప్పి దుండగులు రకరకాల మార్గాల ద్వారా మద్యాన్ని తరలిస్తూ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. కొనేవారు కొదవ లేనప్పుడు సప్లై చేసేవాడు రెచ్చిపోడా అన్నట్టే తయారైంది అక్కడి పరిస్థితి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో మద్యం మాఫియా చెలరేగిపోతోంది. యానాం నుంచి బోట్లలో మద్యం సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కాట్రేనికోన మండల కేంద్రంగా మద్యం మాఫియా ఆటలు సాగుతున్నాయి. పల్లం గ్రామంలో నీళ్లరేవు వంతెన వద్ద పోలీసులపై మద్యం మాఫియా దాడికి పాల్పడింది. 

అనంతరం మద్యం మాఫియా మద్యంతో సహా బోటులోనే పారిపోయింది. పరారైన వారిలో ఇద్దరి చేతులకు బేడీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో బోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్దానిక ఎల్లారమ్మ గుడి వద్దనున్న కాలువలో మద్యంతో సహా బోటును ముంచేసిట్లు తెలుస్తోంది. పల్లం గ్రామంలో పోలీసులపై తిరగబడిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ మద్యం మాఫియా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు, ఈ విషయమై పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు సమాచారం.