9 వేల రష్యన్ సైనికులను చంపాం : జెలెన్‌స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

9 వేల రష్యన్ సైనికులను చంపాం : జెలెన్‌స్కీ

March 3, 2022

18

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9 వేల రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. సైనికుల మృత దేహాలను రష్యా హెలికాప్టర్‌లలో తరలించిందని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న మృత దేహాలను తీసుకువెళ్లడానికి వారి తల్లులు, బంధువులకు అవకాశమిస్తున్నట్టు ప్రకటించారు. ఇక రష్యా కోల్పోయిన ఆయుధాల వివరాలను ఉక్రెయిన్ రక్షణ శాఖ బయటపెట్టింది. 217 యుద్ధ ట్యాంకులు, 374 వాహనాలు, 31 హెలికాప్టర్లు, 30 విమానాలు, 90 ఫిరంగులను కూల్చి పెద్ద మొత్తంలో యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇక రష్యన్ దాడుల్లో రెండు వేల మంది సాధారణ పౌరులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు రష్యా స్పందిస్తూ.. కేవలం 498 మంది సైనికులు మరణించగా, 1597 మంది గాయాలపాలైనట్టు ప్రకటించింది. తమ దాడుల్లో 2870 ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని చెప్పుకొచ్చింది. ఇలా రెండు వైపులా వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ఉభయుల్లో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. రష్యా ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకోగా ఖార్కివ్, కీవ్‌లను కూడా హస్తగతం చేసుకునేందుకు భీకర దాడులు చేస్తోంది.