స్కూల్ భవనం పై అంతస్తు నుంచి పడి విద్యార్థిని మృతి - MicTv.in - Telugu News
mictv telugu

స్కూల్ భవనం పై అంతస్తు నుంచి పడి విద్యార్థిని మృతి

June 13, 2019

Ninth grade student died of jumping from the top floor of school in hyderabad.

పాఠశాలలు పునఃప్రారంభమయి రెండు రోజులు కూడా కావడం లేదు అంతలోనే హైదరాబాద్‌ నాగోల్‌లోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సాయినగర్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థిని వినీత.. ప్రమాదవశాత్తు స్కూల్ భవనం మూడో అంతస్తు నుంచి పడిపోయింది. వెంటనే స్కూల్ సిబ్బంది వినీతను ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సాయినగర్‌లోని నాగార్జున స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. దీనికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కనీసం పై అంతస్తులకు సరైన రీతిలో ప్రహారిగోడ లేకపోవడమే కారణమని తెలుస్తోంది.