నీరవ్ మోదీ ఆస్తులు అమ్మేయండి.. అమెరికా కోర్టు.. - MicTv.in - Telugu News
mictv telugu

నీరవ్ మోదీ ఆస్తులు అమ్మేయండి.. అమెరికా కోర్టు..

March 28, 2018

వేలకోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల అండతో దోచేసుకుని అమెరికాకు చెక్కేసిన వ్యాపారి నీరవ్ మోదీకి చిక్కుల్లో పడ్డాడు. అమెరికాలోని అతని ఆస్తులను వేలం వేయడానికి న్యూయార్క్ కోర్టు అనుమతించింది.  హెచ్ఎస్బీసీ యూఎస్ఏ, న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఇజ్రాయెల్ డిస్కౌంట్ బ్యాంకులకు కూడా మోదీ రూ. 130 కోట్లు ఎగ్గొట్టాడు. ఈ కేసులోనే న్యూయార్క్ కోర్టు తీర్పిచ్చింది.

కోర్టు ఆదేశాలమేరకు వచ్చే నెల 24న అతని ఆస్తులను వేలయం వేస్తారు. మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకు 20 వేల కోట్లను ఎగేసిన సంగతి తెలిసిందే. ఈ బ్యాంకు కూడా నూయార్క్ కోర్టులో మోదీపై పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది అంత సులభం కాదని తెలుస్తోంది. భారత అధికారులు ఈ కేసులో సరిగ్గా వ్యవహరించడం లేదని, నీరవ్‌కు లబ్ధికలిగేలా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా పోలీసులు, అధికారులు పకడ్బందీగా కేసును ఫైల్ చేయడంతో అతని ఆస్తులపై న్యూయార్క్ కోర్టు తీర్పు గట్టి తీర్పు ఇచ్చిందని, భారత దర్యాప్తు సంస్థలు కూడా అలా చేయాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు.