మరో ‘నిర్భయ’ ఘోరం.. గ్యాంగ్‌రేప్ చేసి, ఇనుప రాడ్‌ను.. - MicTv.in - Telugu News
mictv telugu

మరో ‘నిర్భయ’ ఘోరం.. గ్యాంగ్‌రేప్ చేసి, ఇనుప రాడ్‌ను..

February 20, 2018

మదపిచ్చిఎక్కిన మనుషుల దుర్మర్గాలకు అడ్డుకట్టలేకుండాపోతోంది. ఆరేళ్ల కిందట ఢిల్లీ నడిబొడ్డున బస్సులో జరిగిన ‘నిర్భయ’ ఉదంతాన్ని గుర్తుకుతెచ్చే ఘోరం పశ్చిమ బెంగాల్లో జరిగింది. సంతకు వెళ్లిన ఒక మతిస్థితిమితం లేని గిరిజన మహిళ(28)ను కొందరు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత మరింత ఉన్మాదంగా ప్రవర్తించారు. ఆమె మర్మాంగాల్లో ఇనుపరాడ్‌ను చొప్పించి చిత్రహింసలు పెట్టారు. తర్వాత చేతులు కూడా పెట్టి నరకం చూపించారు. బాధితురాలు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టాడుతోంది.ఈ ఘోరం దినాజ్‌పూర్ జిలాలోని దెహబంద్‌లో ఆదివారం జరిగింది. సంతకు వెళ్లిన మహిళను కొందరు అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. చుట్టూవున్న జనం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తర్వాత దుర్మార్గులు ఆమెను ఓ వంతెన కిందకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘోరం తర్వాత బాధితురాలి ఆర్తనాదాలు విన్ని స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు మాల్దా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.