నిర్భయ దోషులకు ఉరిపై తీహార్ మాజీ జైలర్ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషులకు ఉరిపై తీహార్ మాజీ జైలర్ సంచలన వ్యాఖ్యలు

January 17, 2020

Nirbhaya Case

‘నేరస్థులకు ఉరిశిక్షలు వేయడం సరికాదు’ అంటూ తీహార్ మాజీ జైలర్ సునీల్ గుప్త చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. 35 సంవత్సరాల తన వృత్తి జీవితంలో ఎనిమిది మందికి ఉరిశిక్ష అమలు చేసిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘నా 35 ఏళ్ల వృత్తి జీవితంలో పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురు సహా ఎనిమిది మందికి ఉరిశిక్ష అమలు చేశాను. ఉరిశిక్ష అమలు చేయడం వల్ల నేరస్థులు జాగ్రత్త పడి ఆధారాలు దాచేస్తారు. అది ఇంకా ప్రమాదం. అంతే కాకుండా ఉరిశిక్షలు అమలు చేయడం వల్ల నేరాల్ని తగ్గించలేం’ అని అన్నారు. 

కాగా, నిర్భయ కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు జనవరి 7న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత నిందితులకు కోర్టు ఉరి ఖరారు చేసింది.