నిర్భయ దోషుల ఉరికి కొత్త డేట్ ఫిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషుల ఉరికి కొత్త డేట్ ఫిక్స్

February 17, 2020

xfbhnhgn

నిర్భయ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని నలుగురు దోషులకు డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయడం ఇది మూడోసారి. 

దోషులకు న్యాయపరమైన అవకాశాలు పెండింగ్‌లో ఉన్నందున గతంలో జారీ అయిన రెండు డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించింది. 2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) నిర్భయను గ్యాంగ్ రేప్ చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈ కేసులో నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని దోషులు ఒకరి తర్వాత ఒకరుగా న్యాయపరమైన అంశాలను వినియోగిచుకున్నారు. దీంతో ఉరి ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే ముకేశ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. పవన్ గుప్తా మాత్రం ఎలాంటి రివ్యూ, క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేయలేదు. ఇప్పుడు పవన్ తన న్యాయపరమైన అంశాలను ఉపయోగించుకోవడం మొదలెడితే ఉరి మరింత ఆలస్యం అవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయం పడుతున్నారు.