వివాదంలో నిర్మల్ కలెక్టర్.. ఏకంగా 21 మందిని - MicTv.in - Telugu News
mictv telugu

వివాదంలో నిర్మల్ కలెక్టర్.. ఏకంగా 21 మందిని

April 13, 2022

dgxf

తెలంగాణలోని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన టెన్నిస్ ఆడుతున్నప్పుడు బంతులు అందించడానికి 21 మంది వీఆర్ఏలను నియమించుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్ 21 మందిని కలెక్టర్ టెన్నిస్ హెల్పర్లుగా ప్రస్తావిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో వారి పేర్లను కూడా ప్రచురించారు. రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళల్లో కలెక్టర్ బంగ్లాలోని టెన్నిస్ కోర్టు వద్ద బంతులు అందించే విధులకు హాజరు కావాలని ఉత్వర్వుల సారాంశం. తాజాగా ఈ జాబితా ఉత్తర్వులు మీడియాకు చిక్కాయి. దీంతో కలెక్టరుపై వివాదం చెలరేగింది. కాగా, తహసీల్దార్ కలెక్టర్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారా? లేక తనే అత్యుత్సాహంతో విడుదల చేశారా? అనేది తేలాల్సి ఉంది.