సాధారణంగా తీసుకున్న రుణాన్ని కట్టకపోతే బ్యాంకోల్లు ఇంట్లో సామాన్లను జప్తు చేసుడు చూశాం.కానీ నిర్మల్ దగ్గర ఓ విచిత్ర జప్తు జరిగింది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించలేదని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీసులోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ను జప్తు చేశారు. జిల్లాలోని నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన మారుతి.. శ్రీరాంసాగర్ ముంపు బాధితుడు. తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారం అందలేదని మారుతి 1992లో కోర్టుకెళ్లాడు. వాదనలు విన్న కోర్టు బాధితుడికి పరిహారం ఇవ్వాలని 2004లో అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి ఆఫీసు చుట్టు ఎన్నిసార్లు తిరిగినా పరిహారం ఇవ్వకపోవడంతో బాధితుడు మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీంతో జడ్జీ కలెక్టర్ ఆఫీసులో ఉన్న ఫర్మీచర్ ను జప్తు చేయాలని ఆదేశించారు.