నిర్మలా సీతారామన్‌కు భర్త షాక్.. కాంగ్రెస్ విధానాలే మేలు అని.. - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మలా సీతారామన్‌కు భర్త షాక్.. కాంగ్రెస్ విధానాలే మేలు అని..

October 14, 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సొంతింట్లోనే ఊహించని నిరసన వ్యక్తమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని, భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని అంటున్న ఆమె వాదనలు సరికాదని ‘ఇంటి సభ్యుడే’ తేల్చి చెప్పారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ దేశ ఆర్థిక స్థితిగతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఊరుకోకుండా కాంగ్రెస్ హయాంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు అమలు చేసిన విధానాలే బాగుండేవని కొనియాడారు. 

Nirmala sitaraman.

‘దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదు. పీవీ, మన్మోహన్‌ విధానాలే బాగా ఉండేవి. కార్పొరేట్‌ సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వడం వంటి చర్యలెన్ని తీసుకున్నా తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ఎన్ని ‘ఉద్దీపన’ చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. అందుకే, అంతర్జాతీయ సంస్థలు మన దేశ వృద్ధి రేటును తగ్గిస్తున్నాయి..’ అని ఆయన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందూ’లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. దేశానికి ఎదురువుతున్నసవాళ్లను  బీజేపీ అర్థం చేసుకోలేకపోతోందని, ఆ పార్టీకి దూరదృష్టి లేదని విమర్శించారు. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ పార్టీ  చిన్నపాటి మార్గాన్ని కూడా చూడలేకపోతోందన్నారు. మోదీ ప్రభుత్వం నెహ్రూ సోషలిజాన్ని విమర్శించడం మాని, పీవీ, మన్మోహన్‌ల విధానాలను పాటించాలని కోరారు.