అనుష్క నిశబ్ధం ట్రైలర్ వచ్చేసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్క నిశబ్ధం ట్రైలర్ వచ్చేసింది.. 

September 21, 2020

అరుంధతి, భాగమతి సినిమాల తర్వాత అదే స్థాయిలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హీరోయిన్ అనుష్క సిద్ధమైంది. నిశబ్ధం పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా విడుదల చేయబోతున్నారు. దీంట్లో భాగంగా సోమవారం ట్రైలర్‌ విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలో రూపొందించిన ఈ సినిమాలో ట్విస్ట్‌లు ఎలా ఉండబోతున్నాయనేది చూపించారు. 

ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా కనిపించనుంది. హీరో మాధవన్ గిటార్ ప్లేయర్‌గా చూపించారు. అనుష్క స్నేహితురాలు సోనాలి  కనిపించకుండా పోయి క్రైం కథను నడిపిస్తుంది. ఓ దశలో అనుష్కను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది. దీంతో ఆమె వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఆమె నిజంగా దెయ్యంగా మారిందా? అనుష్కను కూడా ఎందుకు టార్గెట్ చేస్తోంది? అనే రకరకాల ప్రశ్నలు ట్రైలర్ లో హైలెట్ చేశారు. అక్టోబర్ 2 న  అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. కాగా దీంట్లో హీరోయిన్ అంజలి, శాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూఛిబొట్ల నిర్మాతలుగా ఉన్నారు. తెలుగు,తమిళ, కన్నడ, హిందీ బాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.