Nishanti is afraid of questions in NEET exam
mictv telugu

నీట్ పరీక్ష.. కఠిన ప్రశ్నలుంటాయని విద్యార్ధిని ఆత్మహత్య

July 17, 2022

పరీక్షలో కఠిన ప్రశ్నలు వస్తాయని భయపడి ఓ విద్యార్ధిని పరీక్ష రాయకుండానే ఆత్మహత్య చేసుకుంది. దేశ వ్యాప్తంగా మెడికల్ సీట్ల కోసం ఆదివారం ఈ పరీక్ష జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్ధిని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. తమిళనాడులోని అరియలూరు రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నటరాజన్, ఉమ దంపతుల కూతురు నిషాంతి గతేడాది ఇంటర్‌లో 529 మార్కులు తెచ్చుకుంది. అదే ఏడాది రాసిన నీట్ పరీక్షలో సీటు రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. అయితే ఈసారి కూడా కఠిన ప్రశ్నలు ఉంటాయని భ్రమించిన నిషాంతి.. వంటగదిలో ఉరేసుకొని చనిపోయింది. ఈ మేరకు లేఖ కూడా రాసింది. కాగా, జీవితం అంటే కేవలం పరీక్షలే కాదని ఎంతో భవిష్యత్ ఉందనే విషయాన్ని విద్యార్ధులు గమనించాలని పోలీసులు కోరుతున్నారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.