గేట్‌లో ఆలిండియా టాప్ ర్యాంకు సాధించిన నిట్ విద్యార్థి - MicTv.in - Telugu News
mictv telugu

గేట్‌లో ఆలిండియా టాప్ ర్యాంకు సాధించిన నిట్ విద్యార్థి

March 17, 2022

op

గురువారం విడుదలైన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్‌-2022) పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో తెలంగాణలోని వరంగల్ నిట్ విద్యార్థి మణి సందీప్ రెడ్డి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. కెమికల్ ఫైనలియర్ చదువుతున్న సందీప్ రెడ్డి టాప్ ర్యాంకు సాధించడం పట్ల నిట్ సంచాలకులు రమణారావు హర్షం వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డిని పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంకు చెందిన తన్నీరు నిరంజన్‌ మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో 9వ ర్యాంకు సాధించాడు. పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు విద్యార్ధలకు ఆలిండియా ర్యాంకులు రావడం పట్ల జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.