నితిన్ కాబోయే భార్యకు చిరుతో అనుబంధం ఇదీ..  - MicTv.in - Telugu News
mictv telugu

నితిన్ కాబోయే భార్యకు చిరుతో అనుబంధం ఇదీ.. 

February 21, 2020

xdfbrthgf

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన నితిన్ పెళ్లితో త్వరలోనే కొత్త లైఫ్ ప్రారంభించబోతున్నాడు. షాలిని రెడ్డితో అతడికి నిశ్చితార్ధం కావడంతో ఈ జంటకు సంబంధించిన విషయాలపై అంతా చర్చించుకుంటున్నారు. ఇంతకీ షాలిని ఎవరూ, వీరికి స్నేహం ఎలా కలిసిందని అభిమానులు తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆమె ఫ్యామిలి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి షాలిని రెడ్డి కుటుంబానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. 

నితిన్ అత్తారిల్లు నాగర్ కర్నూలు జిల్లా. షాలిని రెడ్డి తండ్రి డా. సంపత్ కుమార్, తల్లి డా. షేక్ నూర్జహాన్. వీరిద్దరూ వృత్తిరిత్యా వైద్యులు. స్థానికంగా వీరు ప్రగతి నర్సింగ్ హోం పేరుతో 20 ఏళ్లుగా అక్కడే వైద్యసేవలు అందిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే చిరంజీవికి వీరు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది. మెగాస్టార్ ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. నూర్జహాన్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ నితిన్, షాలిని పెళ్లితో మరోసారి నూర్జహాన్ వార్తల్లోకి వచ్చారు.

కాగా షాలిని రెడ్డి, నితిన్ ఎనిమిదేళ్ల క్రితం నుంచే పరిచయం ఉందట. వీరిద్దరికి మధ్య ఐదేళ్లుగా  ప్రేమ సాగుతోంది. షాలిని తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. ఇప్పుడు వాళ్ల కూతురుకు కూడా అలాగే చేస్తున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో వీరు ఏకం కాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న వీరి పెళ్లి జరగబోతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.