Nithya Menen opens up about fan who turned confounded nuisance
mictv telugu

అతడి వేధింపులు తట్టుకోలేక 30 ఫోన్ నంబర్లు బ్లాక్ చేశా.. నిత్యా మేనన్

August 7, 2022

హీరోయిన్ నిత్యామేనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయని చెబుతూ.. తనను తనను ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా వేధింపులకు గురి చేశారని చెప్పింది. సెల‌బ్రిటీస్ ఇందుకు అతీతం కాదంటూ.. సంతోష్‌ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది. సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి తన పెళ్లి గురించి లేనిపోని వార్తలను మీడియాకు ప్రచారం చేశాడని తెలిపింది. దాదాపు ఆరేళ్ల నుంచి అతడు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని చెప్పింది. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి నాకు ఫోన్లు చేసేవాడని, అతని టార్చర్ తట్టుకోలేక దాదాపు 30 ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేసినట్టు గుర్తు చేసుకుంది.

సంతోష్‌ తనను చాలా రకాలుగా అన్‌ పాపులర్‌ చేశాడని, చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని పేర్కొంది. చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది. అతడి మానసిక స్థితి బాగోలేదనుకుంటా.. వదిలేద్దాం అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. కానీ అతడింకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నాడు’’ అని నిత్యామేనన్‌ వివరించారు. తన గురించి సంతోష్‌ చెప్పేవన్నీ అసత్యాలని వాటిని ఎవరూ నమ్మవద్దని నిత్య మేనన్ కోరింది. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో ధనుష్కు జంటగా నటిస్తున్న తిరుచిట్రంబలమ్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.