Nithya Menon clarifies she is not getting married any time soon
mictv telugu

సినిమాలకు బ్రేక్ ఇస్తున్నా.. నిత్యా మీనన్

July 26, 2022

Nithya Menon clarifies she is not getting married any time soon

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. యాక్టింగ్, సింగింగ్, డబ్బింగ్.. ఇలా ఎన్నో రకాలుగా తన ప్రతిభను చాటుకుంది. అంతేకాదు ఇటీవల ఓ ప్రముఖ సింగింగ్‌ షోకు జడ్జీగా వ్యవహరించింది. తాజాగా తన ఫ్యాన్స్‌కి ఓ షాకిచ్చింది నిత్య. ఇక తాను సినిమాలకు, నటనకు బ్రేక్‌ తీసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన నిత్యా ఈ విషయం చెప్పి అభిమానుల గుండెల్లో పెద్ద బాంబే పేల్చింది. అయితే ఇది కొన్నాళ్లు మాత్రమేనని కూడా స్పష్టం చేసింది. ఏడాదిగా సినిమా, వెబ్‌ సిరీస్‌లు, షోలో క్షణం తీరిక లేకుండా ఉన్నానని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.

ఈ క్రమంలోనే తనపై వచ్చిన రూమర్లను ఖండిస్తూ.. ఈ బ్రేక్‌ పెళ్లి కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. తాను ఓ మలయాళ స్టార్ నటుడిని పెళ్లి చేసుకుంటున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేసింది. సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం కూడా లేదని తేల్చేసింది. ప్రస్తుతం నిత్యా.. తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంది. తన సినిమాలన్ని వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.