Nithya Menon reacted to the marriage news
mictv telugu

పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యమీనన్.. ఇలా చెప్పేసిందేంటీ?

July 20, 2022

మలయాళ స్టార్ హీరోను నిత్యమీనన్ ప్రేమించి పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిత్యమీనన్ స్పందించింది. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పెళ్లి వార్తలను ఖండించారు. అంతేకాక, ఈ రూమర్ వ్యాప్తికి కారణమైన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏ విషయమైనా నిజం తెలుసుకున్నాకే ప్రచురించాలని నా విన్నపం. నా పెళ్లిపై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని వెల్లడించారు. దీంతో పెళ్లి వార్తలు ఒట్టి రూమర్లని తేలిపోయింది. కాగా, తొలి చిత్రంతోనే విభిన్న నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్.. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషలలో సినిమాలు చేసి దక్షిణాది ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఓ తమిళ, ఓ మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు.