Nithya Menon's wedding with star hero soon
mictv telugu

స్టార్ హీరోతో నిత్యమీనన్ పెళ్లి.. ఒప్పుకున్న పెద్దలు?

July 20, 2022

విభిన్న పాత్రలు చేస్తూ తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నిత్యమీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందని ఓ స్టార్ హీరోతో నిత్య గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలకు కూడా ఒప్పుకున్నారని సమాచారం. స్నేహితుల ద్వారా పరిచయం అయిన వీరిద్దరూ తర్వాత ప్రేమలో పడ్డారని ఆమె సన్నిహితులు చెప్తున్నట్టు మాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. అతని గురించి ఎక్కడా కనీసం గాసిప్పు కూడా రావడం లేదు. అంతా లోపల్లోపల గోప్యంగా జరుగుతుందనేది అక్కడి మీడియా వాదన. ఏది ఏమైనా నిత్య పెళ్లి వార్తలు విన్న ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అలా మొదలైంది అనే తెలుగు సినిమాతో పరిశ్రమకు పరిచయమైన నిత్యామీనన్.. తర్వాత హీరోయిన్‌గా ఉంటూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసింది. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా కూడా నటించింది. ఇటీవలే పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్‌లో హిట్ కొట్టింది. తాజాగా ఆమె నటించిన మోడ్రన్ హైదరాబాద్ రిలీజైంది.