Nithyaminan slipping down the stairs
mictv telugu

మెట్లపై నుంచి జారిపడ్డ నిత్యామీనన్.. కుంటుతున్న వీడియో వైరల్

June 28, 2022

కథా బలం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చే నటీమణులలో నిత్యామీనన్ ఒకరు. ఆమె గత చిత్రాలు చూస్తే ఈ విషయం నిజమని తేలుతుంది. ఇటీవల పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించిన నిత్యామీనన్.. తాజాగా వెబ్ సిరీస్‌లో నటించింది. మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ జులై 8 నుంచి అమెజాన్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే కార్యక్రమానికి చేతి కర్ర సహాయంతో రావడం, కుంటుతూ ఇద్దరి సహాయకులతో వేదికపై రావడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. అందరూ ఏమైందని అంటూ కంగారు పడ్డారు. వీటన్నింటికి సమాధానం ఆమె తర్వాత ఇచ్చింది. ‘ఈ సిరీస్‌లో ఇలా కుంటుతూ నడిచే క్యారెక్టర్ చేశాను. అయితే అది నిజంగా జరిగింది. ఇటీవలే ఇంట్లో మెట్లపై నుంచి జారి పడ్డాను. దాంతో ఇలా మనుషుల సహాయంతో రావాల్సి వచ్చింది’ అని వెల్లడించింది.