నిత్యానంద మరో సంచలనం..తన చివరికోరిక ఇదేనట  - MicTv.in - Telugu News
mictv telugu

నిత్యానంద మరో సంచలనం..తన చివరికోరిక ఇదేనట 

February 24, 2020

cnbcgncgnh

నిత్య వివాదాలతో దేశం విడిచి పారిపోయి ఏకంగా తన కంటూ ఓ దేశాన్నే ప్రకటించుకున్న నిత్యానంద స్వామి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను భారత్ తిరిగి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమిళనాడుకు తాను రానని చెప్పేశాడు. తన మరణం తర్వాత భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని చెప్పాడు. ఇది తన చివరి కోరిక అని అన్నాడు. తాను నిర్మించుకున్న కైలాస దేశం నిర్మాణం పూర్తైందని కూడా చెప్పాడు. ఆయన మరణం తరువాత తన ఆస్తులు ఎవరికి వెళ్ళాలో కూడా రాసినట్టు తెలిపాడు

గుజరాత్ బాలికల అపహరణ కేసులో ఆయనపై ఇటీవల కేసు నమోదు అయింది. దీంతో దేశం విడిచి ఏకంగా ఈక్వెడార్ సమీపంలోని దీవికి వెళ్లిపోయాడు. అదే తన దేశమని హిందూ సామ్రాజ్యాన్ని  నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. తన దేశానికి ప్రత్యేక పాస్ పోర్ట్, ప్రధానిని కూడా నియమించుకున్నాడు. దీంతో ఆయన కోసం ఇప్పటికే ఇంటర్‌పోల్‌ నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకూ అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయారు. ఇలావుండగా తాాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.