‘నేను చావలేదు.. జస్ట్ సమాధిలోకి వెళ్లానంతే’ - MicTv.in - Telugu News
mictv telugu

‘నేను చావలేదు.. జస్ట్ సమాధిలోకి వెళ్లానంతే’

May 14, 2022

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి తాను చనిపోయినట్టు వచ్చిన వదంతులపై స్పందించారు. తాను చనిపోలేదనీ, బతికే ఉన్నట్టు ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశారు. ‘నేను చనిపోలేదు. సమాధిలోకి వెళ్లాను. దాంతో చనిపోయినట్టు పుకార్లు వ్యాపించాయి. సమాధిలోకి వెళ్లడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. మనుషుల పేర్లు, ప్రాంతాలను గుర్తు పట్టలేకపోతున్నా. 27 మంది డాక్టర్లు నాకు వైద్యం చేస్తున్నారు. శిష్యులు ఎవరూ కూడా కంగారు పడొద్ద’ని సూచించారు. కాగా, లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కిన నిత్యానంద స్వామి 2019లో దేశం విడిచి పారిపోయారు. ఓ ద్వీపం కొనుక్కొని దానిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాడు. అంతేకాక, ప్రత్యేక కరెన్సీ, వీసా, రిజర్వ్ బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నాడు.