8 నెలలకే కూలుతుంది.. గడ్కరీ శాపాలు - MicTv.in - Telugu News
mictv telugu

8 నెలలకే కూలుతుంది.. గడ్కరీ శాపాలు

November 22, 2019

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రాజకీయం క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ జతకట్టేందుకు మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయి. నేతలు పరస్పరం భేటీ అవుతూ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ మాత్రం తప్పుబడుతోంది. వీరి కలయికను అవకాశవాదంగా ప్రచారం చేస్తోంది. ఇదే అంశంపై తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. 

Nitin Gadkari.

ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా 6 లేదా 8 నెలలకే కూలిపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ కలయిక ఎక్కువ కాలం నిలవదని అన్నారు. దీన్ని ఓ అవకాశవాద కూటమిగా అభివర్ణించారు. బీజేపీకి అధికారం దూరం చేయాలనే లక్ష్యంతో అవకాశవాద పునాదులపై ఏర్పాటు చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఎలా కలిసిపోతాయని ప్రశ్నించారు. శివసేనతో పొత్తుల సమయంలో సీఎం పదవి గురించి ఎటువంటి చర్చ జరగలేదని అన్నారు.