భావి భారత కారులో పార్లమెంటుకు వచ్చిన నితిన్ గడ్కరీ - MicTv.in - Telugu News
mictv telugu

భావి భారత కారులో పార్లమెంటుకు వచ్చిన నితిన్ గడ్కరీ

March 30, 2022

fbfbv

పర్యావరణానికి హాని కలిగించని, ఏమాత్రం కాలుష్యాన్ని వెదజల్లని హైడ్రోజన్ ఆధారిత కారులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించారు. బుధవారం తన నివాసం నుంచి పార్లమెంటు వరకు ఆ కారులోనే వచ్చారు. టయోటా మిరాయిగా పిలిచే ఈ కారు వల్ల కిలోమీటరుకు కేవలం రూ. 1.50 మాత్రమే ఖర్చవుతుందని ఆయన తెలిపారు. ఈ కారులో పెట్రోల్ లేదా డీజిల్ బదులు గ్రీన్ హైడ్రోజన్ వాడామని గడ్కరీ పేర్కొన్నారు. భారత దేశంలో చమురు దిగుమతుల తగ్గుదల, విదేశీ మారక ద్రవ్వం ఆదా, పర్యావరణానికి మేలు, స్వీయ సమృద్ధి వంటి అంశాల దిశగా పయనించేందుకు ఈ కారు ఎంతో దోహదపడుతుందని ఆయన వెల్లడించారు. ఇక నుంచి తాను ఇలాంటి కార్లనే వినియోగిస్తానని ప్రకటించారు. కాగా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.