నితిన్ పెళ్లాడబోయే అమ్మాయి ఈమె!: ఫోటో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

నితిన్ పెళ్లాడబోయే అమ్మాయి ఈమె!: ఫోటో వైరల్

February 14, 2020

Nitin.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే చప్పున ప్రభాస్ గుర్తుకొస్తాడు. ఆయన బాగా ఫేమస్ కనుక వెంటనే గుర్తుకొచ్చినా పెళ్లికాని ప్రసాదులు చాాలామందే ఉన్నారు. ఈ బిరుదు వద్దంటూ హీరో నితిన్  ఏప్రిల్‌‌లో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 

అతడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని అని ఈమధ్య బాగా వార్తలు వస్తున్నాయి. తాజాగా నితిన్‌ను పెళ్లాడబోయే అమ్మాయి ఫోటో ఇదేనంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిస్తున్నారు. మరి ఈ విషయంలో నితిన్ క్లారిటీ ఇస్తేగానీ అవునో కాదో చెప్పలేం. ఈ శనివారం హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌, సినీ రంగానికి చెందిన కొంత మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

పెళ్లి ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు. కాగా, నితిన్ బ్యాచిలర్‌గా ఉంటూ నటించిన చివరి సినిమా ‘భీష్మ’. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో పెళ్లంటే దూరంగా పారిపోయే బ్రహ్మచారి పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చదరంగం.. వెంకీ అట్లూరీతో రంగ్ దే సినిమాలలో నటించడానికి నితిన్ సిద్ధమయ్యాడు. పెళ్లి అయ్యాక కొంత విరామం తీసుకుని ఈ షూటింగుల్లో పాల్గొంటాడని సమాచారం.