నితిన్ పెళ్లాడబోయేది ఎవరంటే.. పేరు షాలిని, ఊరు.. - MicTv.in - Telugu News
mictv telugu

నితిన్ పెళ్లాడబోయేది ఎవరంటే.. పేరు షాలిని, ఊరు..

January 13, 2020

Nitin.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో నితిన్ ఒకరు. 35 ఎప్పుడో క్రాస్ చేసిన ఈ హీరో ఇంకెప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడని చాలా రోజులుగా టాలీవుడ్‌లో గుసగుసలు పోతోంది. హీరోగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇంకా పెళ్లి ఊసు ఎత్తడేంటీ అని ఆయన అభిమానులు కూడా వాపోతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాదిరి పెళ్లి వాసన చూడడా అనే గాసిప్స్ వినిపించాయి. అయితే ఇకపై నితిన్ గురించి మాట్లాడుకోవడానికి ఆ టాపిక్ ఉండదు. ఎందుకంటే ఏప్రిల్ 16న ఇతగాడు తన బ్యాచిలర్ లైఫ్‌కు మంగళం పాడబోతున్నట్టు తెలుస్తోంది. 

లండన్‌లో ఎంబీఏ చదివిన షాలిని అనే అమ్మాయిని నితిన్ వివాహం చేసుకుంటున్నాడట. వారిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.  ఏప్రిల్ 14, 15న ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరగనున్నాయట. 500 మందికి దుబాయ్‌లో బస కల్పించేలా నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, నాలుగేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ నగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.