nitingadkari Praise for Manmohansingh
mictv telugu

నితిన్ గడ్కరీ రూటే సెపరేట్

November 9, 2022

ఆయనో కేంద్రమంత్రి.ముక్కుసూటి మనిషి.నోటికి ఏది వస్తే అది మాట్లాడరు. స్టడీ చేసి మరి మాట్లాడుతారు.ప్రత్యర్థుల్లో మంచిని చూడగలుగుతారు. అంతేకాదు సభల్లో వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తారు. ప్రభుత్వ పెద్దలు, పార్టీ అగ్రనేతలకు కోపం తెప్పిస్తాయని తెలిసినా మాట్లాడల్సిందే మాట్లాడేస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దేశంరుణపడి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 1991లో తీసుకొచ్చిన సంస్కరణల భారత్‌కు కొత్త మార్గాన్ని కనిపెట్టాయని ప్రశంసించారు. అంతేకాదు పేదలకోసం ఇప్పుడు అలాంటి సంస్కరణల అవసరముందని గుర్తు చేశారు.

మన్మోహన్ పై ప్రశంసలు

ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయన్నారు. ఆయనకు ఎప్పటికీ దేశం రుణపడి ఉంటుందని చెప్పారు.భారత్‌లోపేదలకు లబ్ధి చేకూర్చే ఉదరవాద సంస్కరణల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. “1991లో మన్మోసింగ్ ఆర్థికమంత్రిగా పలు సంస్కరణలు చేపట్టారు. అవి భారత్‌కు కొత్త మార్గాన్ని చూపెట్టాయి.ఆ సమయంలో నేను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నా. ఈ సంస్కరణ వల్లే రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు సేకరించా.రైతులు, పేదల కోసం మరిన్ని ఉదరవాద ఆర్థిక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికి ఎంత ఉపయోగపడుతాయో చైనాయే ఉదాహరణ” అని అన్నారు. కేంద్రమంత్రిగా ఉండి విపక్ నేతల్ని పొగడం చాలా అరుదు.

గడ్కరీ దారి…

గతంలో నితిన్ గడ్కరీ పలు అంశాలపై నర్భగర్భవ్యాఖ్యలు చేశారు. ఓ దశలో ఢిల్లీ పెద్దలకు కోపం తెప్పించాయి. ఫలితంగా బీజేపీ సెంట్రల్ కమిటీలో నితిన్ గడ్కరీ చోటు పోయింది. అప్పట్లో కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిన గడ్కరీ…చివరిదాకా బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఓ సారి కాంగ్రెస్‌లో చేరాలని స్నేహితుడు ఆహ్వానించారని, అప్పుడే సున్నితంగా తిరస్కరించాలని క్లారిటీ ఇచ్చారు. రవాణమంత్రిగా తనదైనశైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు.

బీజేపీలో ప్రత్యేక స్థానం…

బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిన నితిన్ గడ్కరీ సంథింగ్ స్పెషల్. పార్టీ బలోపేతానికి గట్టి పునాది వేశారు.ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా బీజేపీని నడిపించారు. గడ్కరీ అంటే నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభిమానం. విపక్ష నేతలు సైతం కేంద్రమంత్రి గడ్కరీని అభిమానిస్తారు. పార్టీలతో పనిలేకుండా పనులు చేస్తారన్న పేరుంది. రవాణా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల మనస్సు దోచుకున్నారు. బీజేపీలో ఎంతమంది లీడర్లు ఉన్నా..నితిన్ గడ్కరీ ఈజ్ సంథింగ్ స్పెషల్..