Nitish Kumar inducts 31 ministers including Lalu Yadav's elder son Tej Pratap
mictv telugu

లాలూ పెద్ద కొడుక్కీ మంత్రి పోస్ట్.. మొత్తం 31 మంది..

August 16, 2022

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక రాష్ట్రీయ జనతాదళ్ తో చేతులు కలిపి 8వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ కు చెందిన తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, జితిన్ రాం మాంఝీకి చెందిన హిందుస్తానీ అవాం మోర్చాకు చెందిన ఒక ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం చేశారు. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, అలోక్ మెహతా, రామానంద్ యాదవ్, సురేంద్రప్రసాద్ యాదవ్, లలిత్ కుమార్ యాదవ్, జేడీ(యూ) నుంచి విజయ్ చౌదరి, బిజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, శ్రవణ్ కుమార్, లేషి సింగ్ మదన్ సహాని, ఆఫ్ఖాక్ ఆలంలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసారి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు కేబినేట్ లో చోటు దక్కింది. గతంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వంలో తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో కుటుంబ పాలన, అవినీతికి సంబంధించిన అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈసారి కేబినేట్ లో చోటు దక్కుతుందా లేదా అనే చర్చ సాగింది. చివరికి తేజ్ ప్రతాప్ యావద్ కు అవకాశం దక్కింది.