బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్  రాజీనామా..! లాలూ, నితీష్ ల మధ్య లుకలుకలు..! - MicTv.in - Telugu News
mictv telugu

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్  రాజీనామా..! లాలూ, నితీష్ ల మధ్య లుకలుకలు..!

July 26, 2017

దేశరాజకీయాల్లో సంచలనం..నితీష్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేసాడు,లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుపై వచ్చిన ఆరోపణల క్రమంలో నితీష్ రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్.కొడుకును లాలూ ప్రసాద్ వెనకేసుక రావడం నితీష్ కు నచ్చలేదంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనం,అందుకే  ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.రాజీనామాకు ముందు నితీష్ గంటకు పైగా లీగల్ ఎక్స్ పర్ట్ తో సమావేశం అయినట్టు తెలుస్తుంది.తర్వాత నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ కేసరి నాథ్ తిరుపతిని కలిసి తన రాజీనామాను సమర్పించారు.

దేశంలోనే  ఎవరూ ఊహించని రీతిలో  ఒక రాజకీయ కూర్పు సంభవించింది,అదే లాలూ,నితిన్ ల కూటమి.అయితే ఈ కూటమి రెండేండ్ల లోనే కూలిపోవడం రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడానికి కనిపిస్తుంది.