Nitish's resignation as CM?
mictv telugu

సీఎం పదవికి నితీష్ రాజీనామా? అదే బాటలో 16 మంది బీజేపీ మంత్రులు!

August 9, 2022

సంకీర్ణ ప్రభుత్వం ఉన్న బీహార్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార జేడీయూ – బీజేపీలు తెగతెంపులు చేసుకోవడంతో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్టు సమాచారం. నితీష్‌తో పాటు 16 మంది బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా బీజేపీ అడిగింది. ఈ నేపథ్యంలో అక్కడి అధికార, విపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. బీజేపీ పొత్తు వీడితే నితీష్‌కు మద్ధతు తెలుపుతామని కాంగ్రెస్, ఆర్జేడీలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో లాలు ప్రసాద్ యాదవ్ నివాసంలో ఆ పార్టీ నేతలు భేటీ నిర్వహించారు. బీజేపీ నేతలు డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా నితీష్‌ను పలకరించగా, కాసేపట్లో భారీ బ్రేకింగ్ వార్త చెప్తానంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. దీంతో కచ్చితంగా రాజీనామా చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.