అత్యాచారాల నిత్యానంద ఆ దేశంలో దాక్కున్నాడు! - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచారాల నిత్యానంద ఆ దేశంలో దాక్కున్నాడు!

January 22, 2020

Nityananda may be in belize 

పలువురు మహిళలపై, బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురుడు నిత్యానంద స్వామి ఆచూకీ బయటపడింది! ఆయన కరీబియన్ ద్వీపదేశమైన బెలిజ్‌లో దాక్కేకున్నట్లు నిఘా వర్గాలు అంచనాకు వస్తున్నాయి. భారత పాస్‌పోర్టు లేని నిత్యానందుకు గత ఏడాది బెలిజ్ దేశ పాస్’పోర్టు తీసుకున్నాడు. అయితే దానిపై ప్రయాణాలు చేసినట్లు ఆధారాలు లభించకపోవడంతో అతడు అక్కడే ఉన్నట్లు భావిస్తున్నారు. 

ఆయనను పట్టుకోడానికి ఇంటర్’పోల్ సంస్థ బ్లూకార్నర్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెలిజ్‌లోని కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి ఆయన గతంలో గౌరవ పట్టా పుచ్చుకున్నాడు. అక్కడి భక్తులు ఆయనకు పాస్ పోర్టు పొందడానికి సాయం చేసినట్లు తెలుస్తోంది. ఈక్వెడార్ సరిహద్దులో తాను కైలాస పేరుతో ప్రత్యేక హిందూ దేశాన్ని ఏర్పాటు చేశానని, శివుడి అవతారమైన తనకు అందరూ భూరి విరాళాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు! మరోపక్క.. ఆయన దేశం నుంచి తప్పించుకుని పోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు సాయపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యానంద నేపాల్ వెళ్లి, అక్కడి నుంచి విమానంలో చెక్కేసి ఉంటాడని వార్తలొస్తున్నాయి.