సొంత దేశాన్ని స్థాపించిన నిత్యానంద! - MicTv.in - Telugu News
mictv telugu

సొంత దేశాన్ని స్థాపించిన నిత్యానంద!

December 3, 2019

రాసలీలల స్వామి నిత్యానంద ఆచూకీ బయటపడుతోంది. దేశం నుంచి పారిపోయిన ఆయన పసిఫిక్ సముద్రంలోని విదేశాలకు చెక్కేసి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మీడియాలో, ఆయన ఏర్పాటు చేసినట్లు చెబుతున్న దేశం వెబ్ సైట్‌లోని వివరాల  ప్రకారం.. బాలికల అపహరణ కేసు ఎదుర్కొంటున్న స్వామి అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి నకిలీ పత్రాలతో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్లిపోయారు. అక్కడ ఊరికే చేతులు పిసుక్కుంటూ ఉండిపోకుండా.. ఈక్వెడార్ దేశం నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుక్కున్నాడు. దానికి కైలాస అని పేరు పెట్టి జాతీయ చిహ్నాన్ని, జాతీయ పతాకాన్ని, పాస్ పోర్టును కూడా తయారు చేయించుకున్నాడు. అది తన దేశమని, దానికి సార్వభౌమత్వాన్ని ఇవ్వాలని దేశాలను అర్థిస్తున్నాడు. 

Nityananda

ఈ ద్వీపం ట్రినిడాద్ అండ్ టొబోగో దేశానికి దగ్గర్లోనే ఉంది. ‘కైలాస’ దేశాన్ని గొప్ప హిందూ సార్వభౌమ దేశంగా ప్రకటించుకున్న ఆయన ఏకంగా మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేశారని, దానికి ఒక భక్తుడు ప్రధానిగా వ్యవహరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తమ దేశానికి సరిహద్దులు లేవని హిందూధర్మ పునరుద్ధరణే తమ లక్ష్యమని నిత్యానంద దేశం తన వెబ్ సైట్లో చెప్పుకుంటోంది. విరాళాలు కూడా అడుగుతోంది.