ఇవాంకాకు రాచవిందు.. నిజాం మనవడి గుస్సా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాకు రాచవిందు.. నిజాం మనవడి గుస్సా..

November 29, 2017

ఇదంతా ఇవాంకా కాలం.. ఎక్కడ చూసినా ఆమె ముచ్చటే.. అయితే చివరి నిజాం మనవడు నజాఫ్ అలీ ఖాన్ మాత్రం కుతకుత ఉడికిపోతున్నాడు. నిన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇవాంకాకు రాచమర్యాదలు చేసి, ఆమెతోపాటు వందలమందికి విందు ఇవ్వడం తెలిసిందే.

అయితే దీనికి నజాఫ్‌ గారిని పిలవలేదు. హైదరాబాదును వందలేళ్లు పాలించి, ఫలక్‌నుమా ప్యాలస్‌తో నగరానికి చక్కని గుర్తింపు తెచ్చిన తమ వంశంవారిని విందుకు ఎందుకు పిలవలేదని ఆయన మండిపడుతున్నాడు.

‘విందు విషయమై కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ అధికారులు పది రోజులుగా నాతో మాట్లాడుతూనే ఉన్నారు.. ఇవాంకా కోసం నిజాం గదిని బుక్ చేసినట్లు చెప్పారు. నిజాం పాలకుల సంప్రదాయం ప్రకారమే ఆమెకు స్వాగతం పలికామని, రాచవంశస్తులు తినే తిండినే ఆమెకు పెడతామని చెప్పారు.. ఇదంతా మా వంశ సంస్కృతి. అన్నీ మావే.. అంతా మాదే.. కానీ విందుకు మాత్రం నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? ఇది దారుణం.. ’ అని రాచకుమారుడు అగ్గిమీద గుగ్గిలైపోతున్నాడు.