Nizam Nawab usman ali khan gave an expensive gift to Queen Elizabeth
mictv telugu

ఎలిజబెత్‌కు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చిన నిజాం.. విలువెంతో తెలుసా!

September 9, 2022

సుదీర్ఘకాలం బ్రిటన్ రాణిగా ఉంటూ రికార్డు సాధించిన క్వీన్ ఎలిజబెత్ 2 కి భారత్‌తో మంచి అనుబంధం ఉంది. ఆమె మూడుసార్లు మన దేశంలో పర్యటించారు. 1961, 1983, 1997 లలో పర్యటించి తాజ్ మహల్, చెన్నై, ముంబై వంటి నగరాలను సందర్శించారు. చైన్నైలో కమల్ హాసన్ చిత్రం షూటింగులో దాదాపు 20 నిమిషాలు గడిపారు. ఎలిజబెత్ వివాహం 1947లో జరుగగా, అప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు గాంచిన నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విలువైన బహుమతిని కానుకగా పంపారు. తన స్థాయికి తగ్గ బహుమతి ఇవ్వాలని తలచి లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల సంస్థ ప్రతినిధులను రాణి వద్దకు పంపారు. ఆమెకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటుందనీ, దాని అనుగుణంగా ఆభరణం తయారు చేయాలని ఆదేశించారట. దాంతో ఎలిజబెత్ తనకిష్టమైన డిజైన్ సెలెక్ట్ చేయడంతో కంపెనీ వారు తయారు చేసి ఇచ్చారు. పెళ్లిలో ఎలిజబెత్ ఎంతో ఇష్టంగా ఈ నగను ధరించింది. ఇప్పటివరకు రాయల్ ఫ్యామిలీకి వచ్చిన అత్యంత ఖరీదైన కానుక ఇదేనని చెప్తారు. ఈ నగలో 300 వజ్రాలు పొదగగా, దీని విలువ 66 మిలియన్ పౌండ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలిజబెత్ తరచూ ధరించే ఈ నగ ఫోటోను రాజకుటుంబం ఈ ఏడాది జులై 21న తమ అధికారిక ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేసింది.